కోలీవుడ్: తనకి కమర్షియల్ విజయాలు వరించినప్పటికీ వైవిద్యం కోసం పరితపించే హీరో విక్రమ్. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుండాడు. సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఈ తమిళ హీరో. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కోబ్రా’. ఈ సినిమా నుండి విక్రమ్ కి సంబందించిన సెకండ్ లుక్ విడుదల చేసారు. ఇందులో విక్రమ్ హాఫ్ ఫేస్ చూపిస్తూ మిగతా హాఫ్ ఫేస్ నంబర్స్ ని చూపిస్తూ ‘ప్రతీ సమస్యకి గణిత పరిష్కారం ఉంటుంది’ అని ఒక టాగ్ లైన్ ద్వారా తెలిపారు. ఈ సినిమా టైటిల్ మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాని టెక్నికల్ నేపధ్యం తో కూడిన ఒక భారీ కార్పొరేట్ స్కాం ని బేస్ చేసుకుని తీస్తున్నట్టు ఒక టాక్ ఉంది. ఈ సినిమా ద్వారా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ‘ఇర్ఫాన్ పఠాన్’ సినిమా రంగం లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాలో పఠాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో విక్రమ్ దాదాపు ఇరవై పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ఈ లుక్ తో కలిపి ఇప్పటికి రెండు లుక్స్ విడుదల అయ్యాయి. ఏ ఆర్ రహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని 2021 సమ్మర్ లో విడుదల చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.