కోలీవుడ్: తమిళనాట హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే హీరోల్లో ‘విక్రమ్‘ ముందుంటాడు. కేవలం మేకప్ లు మాత్రమే కాకుండా ఒక సినిమా కోసం తన బాడీ ని కూడా ఎన్ని రకాలుగా మార్చుకోమంటే అన్ని రకాలుగా మారుస్తాడు అని శంకర్ ‘ఐ’ సినిమా ద్వారా నిరూపించాడు విక్రమ్. తాను తీసే ప్రతీ సినిమాలో రక రకాల గెటప్ లలో కనిపిస్తుంటాడు. ఈ సారి ఒక జీనియస్ మాథమెటిషియన్ పాత్రతో మనముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న సినిమా ‘కోబ్రా’. ఈరోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రతో భారత దేశం తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన మాజీ పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా నటించాడు.
ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మరో సారి విక్రమ్ ని భిన్నమైన గెటప్ లలో చూడబోతున్నాం అని తెలుస్తుంది. ఒక జీనియస్ మాథమెటిషియన్ గా సమాజంలో బ్రతికే ఒక వ్యక్తి తన తెలివితేటల్ని వాడి కొన్ని క్రైం లని ఛేదించాడా లేకపోతే కొందర్ని కాపాడడం కోసం కొన్ని క్రైం లని చేశాడా అనేది సస్పెన్స్ లాగా ఉండిపోయింది. ఎందుకంటే ఒక జీనియస్ లాగా చూపించి , రకరకాల గెటప్ లలో పలు క్రైమ్స్ లో పాల్గొన్నట్టు అతన్ని పట్టుకోవడానికి ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రతో ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్నట్టు ట్రైలర్ లో చూపించారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. చాలా రోజుల తర్వాత ఎ ఆర్ రెహమాన్ ఈ సినిమా ద్వారా సౌత్ ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.