హాలీవుడ్: క్రిస్టోఫర్ నోలన్, హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకి పరిచయం అక్కర్లేని పేరు.కొందరికి ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన అర్ధం కావు. ఆయన సినిమాలు డీకోడ్ చేసి రాసిన సమ్మరీ చూస్తే సినిమాలో అంత ఉందా అని నోరెళ్లబెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగులో 1 నేనొక్కడినే సినిమా చూసే ఏమి అర్ధం అవలేదు అన్నారు ఇక్కడి ప్రేక్షకులు అలాంటిది నోలన్ సినిమాలు చూస్తే సబ్ టైటిల్స్ లేకుండా వేరే బాషా సినిమా చూసినట్టుంటుందేమో ఇక్కడి ప్రేక్షకులకి.
ప్రస్తుతం క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వచించిన టెనెట్ అనే సినిమా విడుదలకి సిద్ధం గా ఉంది. నోలన్ ఇంటిముందు సినిమాల్లాగానే ఇది కూడా వైవిధ్యంగా ఉంది. ఈ సినిమాలో టైం డెమెన్షన్ మీద వర్తమానం, ప్రస్తుతం, భవిష్యత్తు సెన్స్ ఆధారంగా చేసుకొని సినిమా ఫాన్స్ ని తన రకమైన ప్రపంచం లోకి తీసుకపోబోతున్నట్టు ట్రైలర్, టీజర్స్ ద్వారా తెలుస్తుంది.
అయితే ఈ సమ్మర్ లోనే విడుడల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇంకా చివరగా 2020 లో ఈ సినిమా విడుదల ఉండదు అన్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఆగష్టు 12 ని విడుదల అవబోతున్నట్టు ఇదివరకే ప్రకటించినా, కరోనా వల్ల పరిస్థితులు మెరుగవకపోవడం తో ఈ సినిమాని 2021 కి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇది ఒక రకంగా నోలన్ ఫాన్స్ కి నిరాశే అని చెప్పుకోవచ్చు.