అమరావతి : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి ‘గ్లోబల్ వర్చువల్ సమ్మిట్-2021‘కు రావాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆహ్వానం అందించింది. దేశాలు, రంగాల వారీగా ఫిబ్రవరిలో నిర్వహించనున్న భారీ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సహా పాల్గొనాలని ఆహ్వానం అందించింది.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ తమ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఐఐ రీజనల్ డైరెక్టర్ సతీష్ రామన్ శుక్రవారం పారిశ్రామిక మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డితో భేటి అయ్యారు.
ఈ సందర్భంగా వారు ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీలో సీఐఐతో భాగస్వామ్యానికి మంత్రి మేకపాటి సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘ఒక జిల్లా-ఒక వస్తువు’పై పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు సీఐఐ ప్రతిపాదన అందించింది. ఎమ్ఎస్ఎమ్ఈ, నైపుణ్యం, వైద్య, మౌలికసదుపాయాల కల్పన, సీఎస్ఆర్ నిధుల అంశాలపై మంత్రి మేకపాటితో సీఐఐ రీజనల్ డైరెక్టర్ చర్చించారు.