హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
బంజారాహిల్స్‌లోని పోలీస్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ మీటింగ్‌కు దిల్ రాజు, దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, నిర్మాతలు, నటులు సహా 50 మంది పైగా సినీ ప్రముఖులు హాజరయ్యారు.
సంఘటనలు, సమస్యలపై చర్చించడంతో పాటు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కొన్ని కీలక సూచనలు చేశారు.
“తెలంగాణలో సినిమా పరిశ్రమను మరింత ప్రోత్సహించాలి.
పరిశ్రమ అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేయాలి, అంటూ సూచించిన రేవంత్, త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ సినీ కాంక్లేవ్ నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు.
ఈ కాంక్లేవ్‌ను బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇండస్ట్రీ ప్రతినిధులు, అంతర్జాతీయ సినిమా ప్రముఖులు ఇందులో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు.
ఇది తెలుగు పరిశ్రమకు మాత్రమే కాకుండా, హైదరాబాద్ సిటీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సమావేశం తరువాత, రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ కాంక్లేవ్ ప్రతిపాదన సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ హైదరాబాద్‌లో (HYDERABAD) నిర్వహిస్తే, ప్రపంచ సినిమాలలో తెలుగు పరిశ్రమ ప్రాధాన్యత మరింత పెరుగుతుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.