టాలీవుడ్: ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు కళల పైన కొన్ని సినిమాలు వస్తుంటాయి. ఇదివరకే సంగీతం పైన, నాట్యం పైన కే.విశ్వనాధ్ సినిమాలు ఉండేవి. ఆ తర్వాత అలాంటి సినిమాలు తీసేవారు కరువయ్యారు. ఈనాడు వారి ఉషా కిరణ్ మూవీస్ కొంత వరకు ప్రయత్నాలు చేసారు కానీ ఈ మధ్య అలాంటి ప్రయత్నం ఐతే ఎవరు చేయలేదు. ఐతే ప్రస్తుతం మన దేశీయ నృత్యాలకి సంబంధించి పూర్తి ట్రెడిషనల్ డాన్స్ కి సంబందించిన సినిమాగా ఒక ఇన్స్పిరేషనల్ డ్రామా గా ‘నాట్యం’ అనే సినిమా రూపొందింది. ఇందులో నటించింది కూడా ప్రముఖ కూచిపూడి నాట్యకారిని ‘సంధ్య రాజు‘. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని ఇవాళ జూనియర్ ఎన్ఠీఆర్ విడుదల చేసి సినిమా టీం కి విషెస్ తెలియచేసారు.
ఈ టీజర్ లో నాట్యం అంటే ఏంటి అని ఒక చిన్న డైలాగ్ లో తెలిపిన తీరు బాగుంది. ‘మనం వినే కథని కళ్ళకి అభినయించి చూపిస్తే దాన్ని నాట్యం అంటారు’ అనే ఒక డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది. బహుశా ఇందులో డాన్స్ నేర్చుకోవడానికి అదే మూలం అన్నట్టుగా చూపించి ఉండచ్చు. ఇందులో మరొక ముఖ్య పాత్రలో కమల్ కామరాజ్ నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రకరకాల టైం ఫ్రేమ్ లలో కన్పించింది. ఈ సినిమాకి రేవంత్ కోరుకొండ రచన, దర్శకత్వం, ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. త్వరలో దిల్ రాజు ప్రొడక్షన్ వారు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.