టాలీవుడ్: ప్రస్తుతం బయోపిక్ లు స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా మూవీస్ కి క్రేజ్ ఎక్కువగా నడుస్తుంది. దాదాపు అన్ని ఇండస్ట్రీస్ లో ఇదే సీన్ కనపడుతుంది. తెలుగులోనే ప్రస్తుతం నాలుగు స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ షూట్ లో ఉన్నాయి. నాగ శౌర్య నటిస్తున్న ‘లక్ష్య’, వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’, విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’, కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ ముగియడంతో దాదాపు సినిమాలన్నీ షూటింగ్ కార్యక్రమాలు పునః ప్రారంభించాయి.
తెలుగు లో మొదటి సారి ఆర్చరీ బేస్డ్ సినిమాగా ‘లక్ష్య’ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో నాగ శౌర్య లుక్ అవుట్ స్టాండింగ్ గా ఉండబోతుందని విడుదల చేసిన పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది. ఈ రోజు నుండి క్లైమాక్స్ షూట్ ప్రారంభిస్తున్నట్టు ఒక వీడియో బైట్ విడుదల చేసింది సినిమా టీం. ఈ సినిమాని సంతోష్ జాగర్లపూడి అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఏషియన్ మూవీస్ , నార్త్ స్టార్ మూవీస్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ మరియు శరత్ మరార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
మొదటి నుండి ప్రయోగాత్మక మరియు కొత్తదనం ఉండే సినిమాలు, లవ్ స్టోరీస్ లో నటించిన మెగా హీరో వరుణ్ తేజ్ మొదటి సారి బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. మెగా హీరోల్లో పవన్ కళ్యాణ్ 90 ల్లో ‘తమ్ముడు’ సినిమాలో బాక్సర్ గా నటించాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మెగా ఫామిలీ నుండి వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ‘గని’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కూడా క్లైమాక్స్ షూట్ లో ఉన్నట్టు ఈ రోజు మేకర్స్ ధృవీకరించారు. అల్లు బాబీ ఈ సినిమాని నిర్మిస్తుండగా కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.