హైదరాబాద్: భారత్ లో కరోనా పై పోరుకు సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకున్నాయి. ఇటీవలే డిజీసీఐ ఆమోదం పొందిన భారత్ బయోటెక్ కంపెనీ తమ కొవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించినట్లు తెలిపింది.
భారత్ బయోటెక్ తమ క్లినికల్ ట్రయల్స్ మొదటి దశను ఈ నెల్ 15వ తేదీన ప్రారంభించింది. ఈ ప్రయోగాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. ఈ దశలో 375 మంది పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ ట్రయల్స్ ప్రారంభం అయినట్లు ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపంది.
మొదటి దశ పూర్తి అయిన తరువాత మిగిలిన దశలు ఎప్పుడు మొదలవుతాయో తెలియజేస్తామంది. అన్ని దశలు దాటి త్వరలోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కరోనా నివారణకు దేశీయ తయారీ మందు కావడం వలన తమకు మంచి గుర్తింపు లభిస్తోందని ఇది ఎంతో ఆనందమైన విషయం అని కంపెనీ తమ ట్విట్టర్ లో పేర్కొంది.