fbpx
Thursday, September 19, 2024
HomeTelanganaరాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ ప్రయాణం

రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ ప్రయాణం

CM-Revanth-Reddy’s-foreign-travel

తెలంగాణ: రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ ప్రయాణం

అసెంబ్లీ సమావేశాలు పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు విదేశాల బాట పట్టారు.

ఈ రోజు (శనివారం) ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా, దక్షిణ కొరియా దేశాల టూర్‌కు వెళుతున్నారు.

మొత్తం పన్నెండు రోజులు సాగనున్న ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రణాళిక చేసుకున్నారు.

విధానములు:

ముఖ్యమంత్రి రేవంత్ వెంట సీఎస్ శాంతకుమారి, ఐటీ మరియు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి తదితరులు వెళ్లనున్నారు.

ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు, సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా అమెరికా పర్యటనకు వెళతారు. వారు అందరూ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ అండ్ టీంతో కలుసుకుంటారు.

పలువురు పారిశ్రామికవేత్తలు మరియు ప్రవాస భారతీయులతో భేటీ కానున్న సీఎం రేవంత్ ఈ నెల 10వ తేదీన అమెరికా నుంచి బయలుదేరి దక్షిణ కొరియా సియోల్‌కు చేరుకుంటారు.

అక్కడ పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. తరువాత 14వ తేదీన రాష్ట్రానికి తిరిగి వస్తారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఏడాది ఆరంభంలో (జనవరి 15) దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న రేవంత్, పెట్టుబడుల కోసం తాజాగా విదేశాలకు పర్యటించడం ఇదే తొలిసారి.

పర్యటన వివరాలు:

తన పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాల్లో (న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, కాలిఫోర్నియా) ఆయన పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యే వివిధ కంపెనీల ముఖ్యల జాబితాను చూస్తే….

అమెరికా ముఖ్యమైన సమావేశాలు:

  • ఆగస్టు 5: కాగ్నిజెంట్ సీఈవో, సిగ్నా సీనియర్ అధికారి, ఆర్-సీఎం టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ.
  • ఆగస్టు 6: పెప్సికో హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో భేటీ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం.
  • ఆగస్టు 7: ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, పలు ఐటీ సంస్థలతో భేటీలు.
  • ఆగస్టు 8: ట్రినెట్ సీఈవో, ఆరమ్, ఆమ్‌జెన్, రెనెసాస్, అమాట్ సెలెక్ట్, టెక్ యూనికార్న్ ప్రతినిధులతో పాటు సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాలు.
  • ఆగస్టు 9: గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ, స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ సందర్శన, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్, జెడ్ స్కేలర్ సీఈవో, ఎనోవిక్స్, మోనార్క్ ట్రాక్టర్స్, థెర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులతో భేటీ.

దక్షిణ కొరియాలో ముఖ్యమైన సమావేశాలు:

  • ఆగస్టు 12: యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ట టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో పాటు ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ.
  • ఆగస్టు 13: కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధులతో పాటు సామ్‌సంగ్, ఎల్‌జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular