ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ సంచలన ఆరోపణలు చేసింది!
వాణిజ్య రహస్యాల దుర్వినియోగంపై వివాదం
ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థలైన కాగ్నిజెంట్ (Cognizant), ఇన్ఫోసిస్ (Infosys) మధ్య వాణిజ్య రహస్యాల వివాదం ముదిరింది. అమెరికాలో ఈ రెండు సంస్థలు మధ్య న్యాయపోరాటం కొనసాగుతుండగా, తాజాగా కాగ్నిజెంట్ షాకింగ్ ఆరోపణలు చేసింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ ట్రైజెట్టో (Trizetto) నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపించింది.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందా?
కాగ్నిజెంట్ ప్రకారం, ఇన్ఫోసిస్ నాన్-డిస్‌క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్ (NDAAs) నిబంధనలను ఉల్లంఘించి, ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను కాజేసిందని ఆరోపిస్తోంది. అంతేకాదు, ఈ వ్యవహారంపై ఆడిట్ నిర్వహించేందుకు ఇన్ఫోసిస్ నిరాకరించిందని కాగ్నిజెంట్ పేర్కొంది.
అమెరికా కోర్టులో దావా
ఈ ఆరోపణలపై కాగ్నిజెంట్ 2024 ఆగస్టులో అమెరికాలో దావా వేసింది. కాగ్నిజెంట్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయని, వాణిజ్య రహస్యాల దుర్వినియోగ ఆరోపణలు అసత్యమని ఇన్ఫోసిస్ తిప్పికొట్టింది.
రవికుమార్ వ్యవహారం
ఈ వివాదానికి మరో కోణంగా ఇన్ఫోసిస్ మాజీ అధ్యక్షుడు రవికుమార్ వ్యవహారం నిలిచింది. 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడిన రవికుమార్, 2023 జనవరిలో కాగ్నిజెంట్ సీఈఓగా చేరారు. తమవద్ద పనిచేసిన సమయంలో హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ విడుదల చేయడాన్ని రవికుమార్ కావాలనే ఆలస్యం చేశారని ఇన్ఫోసిస్ ప్రత్యారోపణలు చేసింది. అదే సమయంలో కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని పేర్కొంది.
హెల్త్‌కేర్ ఐటీ రంగంలో పోటీ
ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ రెండు సంస్థలు హెల్త్‌కేర్ ఐటీ రంగంలో పెద్ద పోటీదారులుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయంలో 7.5% షేర్ లైఫ్ సైన్సెస్ విభాగం నుంచి వస్తుంది. ఈ రంగంలో తమ ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమంలోనే ఇరు సంస్థల మధ్య న్యాయపోరాటం చోటు చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.