మూవీడెస్క్: పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమా సాంగ్స్ మీద ట్రోల్స్ వచ్చినప్పటికీ, యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా బాగానే క్లిక్ అయ్యాయి.
ఎన్టీఆర్ ప్రమోషన్ విధానం మరియు అతని కాన్ఫిడెన్స్ చూసి ఫ్యాన్స్ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉన్నారు.
ఇప్పుడు సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ టాక్ ప్రకారం, దేవర 1 ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 180 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
నైజాం, ఆంధ్రా ప్రాంతాలు కలిపి 113 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో 15 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, హిందీ బెల్ట్‌లో 15 కోట్లకు పైగా బిజినెస్ పూర్తి అయినట్లు సమాచారం.
ఇక ఓవర్సీస్ హక్కులు 26 కోట్లకు అమ్ముడవ్వడంతో, ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది అత్యధికంగా నిలిచింది. గ్రాస్ వసూళ్ల పరంగా సినిమా 350 కోట్ల మార్క్ దాటాల్సిన అవసరం ఉంది.
దేవర బాక్సాఫీస్ కు తొలి రోజు రెస్పాన్స్ చాలా కీలకం, అది మిగతా రోజులకు నిర్ణయాత్మకంగా మారవచ్చు.