fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsఅక్టోబర్ 23 న ఆహా అనబోతున్న 'కలర్ ఫోటో'

అక్టోబర్ 23 న ఆహా అనబోతున్న ‘కలర్ ఫోటో’

ColorPhotoMovie Releasingon October23inOTT

హైదరాబాద్: ముందుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే కలర్ ఫోటో సినిమా ఓటీటీ లో విడుదల అవబోతుంది. అందరూ కొత్త వాల్ల తోనే తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమా పై ఒక వర్గం ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇపుడు థియేటర్ లో విడుదల చేసే పరిస్థితి లేకపోవడం తో ఈ సినిమాని అల్లు వారి ఆహా ఓటీటీ లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసారు. అక్టోబర్ 23 నుండి ఈ సినిమా ఆహా ఓటీటీ లో విడుదల అవబోతుంది. చాయ్ బిస్కెట్ ద్వారా ఫేమస్ అయిన సుహాస్ హీరోగా, సందీప్ రాజ్ డైరెక్టర్ గా ఈ చిత్రం ద్వారా వాల్ల కెరీర్ లో ఒక పెద్ద అడుగు వెయ్యబోతున్నారు. సుహాస్ కి జోడిగా తెలుగమ్మాయి ‘చాందిని చౌదరి’ నటిస్తుంది.

కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమానుండి విడుదలైన ఒక పాట శ్రోతల్ని బాగానే ఆకట్టుకుంది. విలన్ గా నటిస్తున్న కమెడియన్ సునీల్, వైవా హర్ష తప్ప మిగతా టీం అంతా కొత్త వాల్లే అవడం ఈ సినిమా విశేషం. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్, జెన్నీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా‘, సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ కూడా విడుదల అవబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular