fbpx
Thursday, March 27, 2025
HomeMovie News'కలర్ ఫోటో' టీజర్ విడుదల

‘కలర్ ఫోటో’ టీజర్ విడుదల

ColorPhotoMovie Teaser Released

హైదరాబాద్: తెలుగు లో వచ్చే కొన్ని సినిమాలు ఇవి ఎందుకు తీసార్రా, డబ్బులు ఎక్కువైనట్టున్నాయి అని అనుకొనేలా ఉంటాయి. కొన్ని సినిమాలు చాలా బాగా ఉంటాయి. ఆ సినిమాలు ఆడినా ఆడకపోయినా చూసిన వాళ్ళకి మాత్రం మంచి ఫీల్ ని కలుగచేస్తాయి. అలాంటి ప్రేమకథ తో సిద్ధం అవుతున్న సినిమా ‘కలర్ ఫోటో’. చాయ్ బిస్కెట్ ద్వారా యూట్యూబ్ వీడియోలు చేస్తూ మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‘, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి ప్రతిభ ఉందని నిరూపించుకున్న సుహాస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అదే చాయ్ బిస్కెట్ ద్వారా యూట్యూబ్ వీడియోలు చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లో నటించి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన సందీప్ రాజ్ ‘కలర్ ఫోటో’ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ‘హృదయ కాలేయం’ ‘కొబ్బరి మట్ట’ లాంటి స్పూఫ్ సినిమాలను తీసిన అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ ఇలాంటి సినిమాతో రావడం ఆసక్తి కరం. ఈ సినిమాకు కాళ భైరవ సంగీతం అందిస్తున్నారు. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి ఛాందినీ చౌదరి నటిస్తుండగా వైవా హర్ష ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ సునీల్ పూర్తి స్థాయి విలన్ గా నటిస్తున్నాడు.

టీజర్ ఆద్యంతం ఒక మంచి లవ్ స్టోరీ చూడబోతున్నామన్న ఫీల్ తో ఉంటుంది అలాగే కాళ భైరవ సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇదివరకే సుహాస్ కామెడీ టైమింగ్ తాను తీసిన సినిమాల ద్వారా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో సుహాస్, వైవా హర్ష కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కొన్ని టీజర్ లో చూపించారు. వాటిని చూస్తే ఈ సినిమాలో కామెడీ బాగా పండిందని అర్ధం అవుతుంది. ”అబ్బాయిల సెలక్షన్ బాగానే ఉంటదిరా కానీ లవ్ సరిగ్గా చేయలేరు.. అమ్మాయిలు లవ్ చేస్తారు కానీ సెలక్షనే..” లాంటి సంభాషణలు కూడా అనవసరంగా తెచ్చి పెట్టుకున్న డైలాగ్స్ లాగ కాకుండా కథలో ఇమిడినట్టున్నాయి. మొత్తంగా ‘కలర్ ఫోటో’ అన్ని ఎలెమెంట్స్ తో ముస్తాబయ్యి సినీ అభిమానుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్టుంది.

Color Photo Official Teaser || Suhas, Sunil, Chandini Chowdary, Sandeep Raj, Sai Rajesh

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular