fbpx
Sunday, December 22, 2024
HomeMovie Newsకమెడియన్ సత్య హీరోగా 'వివాహ భోజనంబు'

కమెడియన్ సత్య హీరోగా ‘వివాహ భోజనంబు’

ComedianSatya AsHeroFor VivaahaBhojanambuMovie

టాలీవుడ్: స్వామి రారా, చలో, కార్తికేయ, రౌడీ ఫెలో, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, మత్తు వదలరా లాంటి సినిమాల్లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య. ప్రస్తుతం సత్య హీరోగా ఒక కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతుంది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం వినోదం తో ఆకట్టుకుంది. ఈ సినిమా ‘వివాహ భోజనంబు’ అనే పేరుతో రూపుదిద్దుకుంది. సిటీ లో ఉండే ఒక పిసినారి అబ్బాయి కరోనా టైం లో పెళ్లి చేసుకుంటే, పెళ్లి తర్వాత అత్తగారింటి వాళ్ళందరూ ఇంటికి వచ్చాక కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించబడింది. ఆ టైం లో ఇంట్లో అంత మందితో ఈ పిసినారి హీరో పంచే వినోదం ప్రధాన అంశంగా ఈ సినిమా రూపొందింది.

ఈ సినిమాలో సత్య కి జోడీ గా అర్జావీ రాజ్ నటించింది. ఈ అమ్మాయికి తెలుగు లో ఇది మొదటి సినిమా. రామ్ అబ్బరాజు దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కరోనా టైం లో జరిగిన కొన్ని రియలిస్టిక్ సిట్యుయేషన్స్ ఆధారంగా రూపొందించారు. వెంకటాద్రి టాకీస్ సమర్పణలో ఆనంది ఆర్ట్స్ మరియు సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ ఈ సినిమాని నిర్మించారు. సందీప్ కిషన్ ప్రొడ్యూసర్ గా మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కూడా చేసారు. టీజర్ మొత్తం వినోదం తో నిండిన ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular