మూవీడెస్క్: సౌత్ సినిమాలపై కామెంట్ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. బాలీవుడ్ తారలు సైతం ఈ ట్రెండ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు.
‘పుష్ప 2,’ ‘దేవర,’ ‘కల్కి 2898ఏడీ’ లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. అయితే, ఈ విజయం కొందరికి అసహనంగా మారింది.
ఒక నార్త్ ఇండియన్ ట్విట్టర్ హ్యాండిల్ “ద బ్యాడ్ డాక్టర్” దక్షిణాది సినిమాలపై నెగిటివ్ కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది.
“సౌత్ సినిమాల్లో ఫార్ములా ఏమిటంటే, శుచీ శుభ్రత లేని హీరో ప్రియురాలిని మెప్పించడానికి పది వేల మందిని కొట్టేస్తాడు” అంటూ అతను ట్వీట్ చేశాడు.
ఈ కామెంట్ ఆన్‌లైన్‌లో వైరల్ కాగా, సౌత్ సినిమాలపై ఉన్న అసహనాన్ని స్పష్టంగా చూపించింది.
దీనిపై నటుడు అడివి శేష్ స్పందిస్తూ, “ఇలాంటి కామెంట్స్ చేసే ముందు అమెరికా, జపాన్, యూరప్ దేశాల్లో సౌత్ సినిమాలు ఎంతగా ఆదరణ పొందుతున్నాయో గమనించండి” అంటూ చురక వేశారు.
ఆయన మాటలు నెటిజన్ల నుండి విశేష స్పందన పొందాయి.
ఇదే సందర్భంలో, నెటిజన్లు కూడా సదరు హ్యాండిల్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
“మీరు సౌత్ సినిమాలపై కామెంట్ చేయడానికి ముందు, బాలీవుడ్‌లో వస్తున్న చిత్రాల స్థాయిని చూసుకోండి” అని ఘాటుగా విమర్శించారు.
సౌత్ సినిమాల విజయాన్ని తట్టుకోలేని కొందరు ఇలానే విమర్శలు చేస్తారని, కానీ ఆడియెన్స్ మాత్రం సౌత్ సినిమాలను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.