fbpx
Saturday, September 7, 2024
HomeMovie Newsఆకట్టుకుంటున్న కమిటీ కుర్రోళ్లు ట్రైలర్!

ఆకట్టుకుంటున్న కమిటీ కుర్రోళ్లు ట్రైలర్!

COMMITTEE-KURROLLU-TRAILER-RELEASED
COMMITTEE-KURROLLU-TRAILER-RELEASED

మూవీడెస్క్: నిహారిక కొణిదెల సమర్పణలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఐశ్వర్య రచిరాజు వంటి యువ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.

ట్రైలర్‌ను చూస్తే, ఈ సినిమా పల్లెటూరు వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించారని తెలుస్తుంది.

జాతరలు, గ్రామీణ ఆటలు, స్నేహితుల మధ్య కలహాలు, ఎన్నికలు వంటి సంఘటనల చుట్టూ తిరిగే కథాంశం ఈ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది.

సాయికుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular