ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వివాదాస్పద పోస్టును కాంగ్రెస్ పార్టీ తక్షణమే తొలగించింది. ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసిన కొద్ది సేపట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పార్టీ వెనక్కు తగ్గింది. ఆ పోస్టు బీజేపీ నేతల నుంచి ఘాటు స్పందనను తెచ్చుకుంది.
కాంగ్రెస్ అధికారిక ఖాతాలో ‘గాయబ్’ అనే క్యాప్షన్‌తో చేసిన ఆ పోస్టు, ప్రత్యర్థి పార్టీల ఆగ్రహానికి కారణమైంది. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ముస్లిం ఓటు బ్యాంకు కోసం మోదీని లక్ష్యంగా చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్ కూడా స్పందిస్తూ, పాకిస్థాన్ స్నేహితుడంటూ రాహుల్ గాంధీ పోలికతో పోస్టు చేశారు. తెలుపు టీషర్ట్, క్యాప్ ధరించిన వ్యక్తి చేతిలో కత్తి పట్టిన ఫోటోను పంచడం ద్వారా తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తక్కువ సమయంలోనే పోస్టు తీయాల్సి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మరో వివాదంలో చిక్కుకున్నట్లయ్యింది.
ప్రస్తుతం ఆ పోస్టు ఎక్స్ వేదికపై అందుబాటులో లేకపోయినా స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.