మూవీడెస్క్: పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న సూర్య పీరియాడికల్ యాక్షన్ మూవీ కంగువా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లు ఊహించిన రేంజ్లో జరుగుతున్నాయి.
తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగి, మార్నింగ్ 7AM షోస్ కూడా ప్లాన్ చేశారు.
అయితే తమిళనాడులో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. శివకార్తికేయన్, సాయిపల్లవి నటించిన “అమరన్” సినిమా థియేటర్స్‌ను ఇంకా ఆక్రమించి ఉండటంతో “కంగువా”కి తక్కువ స్క్రీన్స్ మాత్రమే దక్కాయి.
అమరన్ థియేటర్లలోనూ మంచి వసూళ్లు అందిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు కంగువా ప్లాన్‌పై ఆలోచనలో పడిపోయారు.
ఇక థియేటర్స్ షేర్ విషయంలోనూ వివాదాలు తలెత్తాయి. మేకర్స్ 75 శాతం షేర్ కోరుతూ, థియేటర్లకు నిబంధనలు పెడుతున్నారని టాక్.
మరి తమిళనాడులో ఈ తక్కువ థియేటర్లతో కంగువా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో చూడాలి.