న్యూ డిల్లీ: భారత్లో మొదట్లో నెమ్మదిగా మొదలైన కరోనా ఇప్పుడు విలయ తాండవం చేస్తోంది. ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం గడచిన 24 గంటల్లో దాదాపు 25 వేల కొత్త కేసులు నమోదు కాగా 613 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 6.9 లక్షలకు చేరింది. రష్యాలో నమోదైన 6.8 లక్షల కేసులను అధిగమించి భారత్ 3వ స్థానానికి ఎగబాకింది. అమెరికా 28 లక్షలు, బ్రెజిల్ 15 లక్షల కేసులతో భారత్ కంటే ముందు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
దేశంలో వివిధ రాష్ట్రాలలో నమోదైన కేసులు, మరణాల వివరాలు:
మహారాష్ట్ర కేసులు: 2,00,064, మరణాలు: 8,671
తమిళనాడు కేసులు: 1,02,721, మరణాలు: 1,385
డిల్లీ కేసులు: 97,200, మరణాలు: 3,004
గుజరాత్ కేసులు: 35,312, మరణాలు: 1,925
ఉత్తరప్రదేశ్ కేసులు: 26,554, మరణాలు: 733
కర్ణాటక కేసులు: 23,474, మరణాలు: 372
తెలంగాణ కేసులు: 22,312, మరణాలు: 288
పశ్చిమ బెంగాల్ కేసులు: 21,231, మరణాలు: 736
రాజస్థాన్ కేసులు: 19,532, మరణాలు: 447
ఆంధ్రప్రదేశ్ కేసులు: 17,669, మరణాలు: 218
హర్యానా కేసులు: 16,548, మరణాలు: 260
మధ్యప్రదేశ్ కేసులు: 14,930, మరణాలు: 608
బిహార్ కేసులు: 11,860, మరణాలు: 90
అస్సాం కేసులు: 11,736, మరణాలు: 14
ఒడిషా కేసులు: 9,070, మరణాలు: 36
జమ్ము కాశ్మీర్ కేసులు: 8,246, మరణాలు: 127
పంజాబ్ కేసులు: 6,283, మరణాలు: 164
కేరళ కేసులు: 5,429, మరణాలు: 26
చత్తీస్గడ్ కేసులు: 3,161, మరణాలు: 14
ఉత్తారాఖండ్ కేసులు: 3,093, మరణాలు: 42
ఝార్ఖండ్ కేసులు: 2,739, మరణాలు: 17
గోవా కేసులు: 1,684, మరణాలు: 6
త్రిపుర కేసులు: 1,546, మరణాలు: 1
మణిపూర్ కేసులు: 1,325, మరణాలు: 0
హిమాచల్ ప్రదేశ్ కేసులు: 1,046, మరణాలు: 11
లడఖ్ కేసులు: 1,005, మరణాలు: 1
పుదుచ్చేరి కేసులు: 802, మరణాలు: 12
నాగాలాండ్ కేసులు: 563, మరణాలు: 0
చండీఘడ్ కేసులు: 301, మరణాలు: 5
అరుణాచల్ ప్రదేశ్ కేసులు: 259, మరణాలు: 1
మిజోరం కేసులు: 164, మరణాలు: 0
అండమాన్ నికోబార్ దీవులు కేసులు: 119, మరణాలు: 0
సిక్కిం కేసులు: 103, మరణాలు: 0
మేఘాలయ కేసులు: 62, మరణాలు: 1
ఇందులో రికవరీ రేటు 60.77 ఉండడం సానుకూలాంశం. దేశంలో అన్ లాక్ 2.0 అమలులో ఉన్న నేపథ్యంలో కరోనా కేసుల ఉద్దృతి పెరిగింది. దీంతో ప్రజలు జాగ్రత్త వహించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు కరోనా కట్టడికి వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతమయ్యాయి. ఈ ప్రయోగాలు విజయవంతమై త్వరలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.