జెనీవా: కరోనా మహమ్మరి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద 2 కోట్లకు పైగా ప్రజలకు సోకి అతలాకుతలం చేసింది. దాదాపు 7.96 లక్షల మంది ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే చనిపోయారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కరోన వైరస్ రెండు సంవత్సరాలలో పూర్తిగా అంత అవుతుందని తెలిపారు. 1918 లో వచ్చిన ఫ్లూ కంటే ముందుగానే ఈ వైరస్ ని అంతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కరోనా లాంటి మహమ్మారి శతాబ్దానికి ఒక సారి వస్తాయని తెలిపారు.
ప్రజలు ఈ కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. 1918 లో ఫ్లూ అత్యధిక రోజులు ఉందని, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ మహమ్మారి ని త్వరలోనే అంతం చేయగలమని చెప్పారు. ఈ వైరస్ ని అంతం చేయడానికి ప్రపంచంలోని దేశాలన్నీ కలిసి మెలసి ఐక్యతతో ఒకటవ్వాలన్నారు. ప్రస్తుతం వాడుతున్న వైద్య విధానాలతో పాటు వ్యాక్సిన్ కూడా వస్తే ప్రజల కష్టాలు త్వరగా తీరతాయని తెలిపారు.
1918 లో దేశాల మధ్య అంత రాకపోకలు లేనందున ఫ్లూ అంతగా వ్యాపించలేదని, కానీ ఇప్పుడు ప్రపంచీకరన ఎక్కువ ఉన్నందువల్ల త్వరగా వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. మరో రెండేళ్ళలో ఈ వైరస్ ని అంత చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.