చెన్నై: కరోనా నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చే సమయంలో మాస్కులు తప్పనిసరి చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు విచిత్రమైన మాస్కుల వైపు చూస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో రకరకాల మాస్కులు దర్శనిమిస్తున్నాయి. డ్రస్సులకు మ్యాచింగ్ మాస్కులు కూడా చూస్తున్నాం.
ఇప్పుడు బంగారం, వెండి మాస్కులకు గిరాకి పెరిగింది. ఈ మాస్కులకు ఇప్పుడు ఆదరణ పెరిగింది, ఎందుకంటే ఈ మాస్కులను ఆభరణాలు గా కూడా వాడుకోవచ్చని, తరువాత వాటిని కరిగించి ఇంకో ఆభరణం కూడా చేసుకోవచ్చన్నారు.
ఈ మాస్కులు 18, 22 క్యారెట్ లలో మరియు హాల్ మార్క్ లలో కూడా ఈ మాస్కులు తయారు చేస్తున్నామని కొయంబత్తూర్ జిల్లాకు చెందిన నగల వ్యాపారి రాధాకృష్ణన్ ఆచార్య తెలిపారు. వెండి మాస్కు రూ 15000 నుంచి, బంగారు మాస్కులు రూ 2,75,000 నుంచి అందిస్తున్నామన్నారు.
0.66 ఎం ఎం మందం కలిగిన బంగారు తీగలను మాత్రమే మెషిన్ ద్వారా చేస్తామని, మిగతా పని మొత్తం చేతి తోనే చేస్తామని తెలియజేశారు. బెంగళూరు, హైదరాబాద్ నుండే కాక ఉత్తర భారత దేశం నుంది కూదా ఆర్డర్లు వస్తున్నాయన్నారు.
గంటల తరబడి ఈ మాస్క్‌లను ధరించడంలో అసౌకర్యం గురించి ప్రస్తావించగా ఈ మాస్క్‌లు క్లాత్ వంటి అనుభూతిని ఇస్తాయని, మాస్క్ యొక్క పైభాగంలో మరియు లోపల భాగంలో ఖరీదైన లోహం వాడతామని చెప్పారు. మాస్క్‌లో ఉండే పలు లేయర్లను క్లాత్‌తో చేయడంతో వీటిని ఉతికి తిరిగి వాడుకోవచ్చన్నారు. అయితే వీటిని గట్టిగా వంచడం మాత్రం చేయడనికి వేలు కాదన్నారు.