న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడం ఇక దాదాపుగా ఖరారైనట్టేనని అమెరికా రాజకీయ విశ్లేషకుల అంచనా.
కాగా, జో బైడెన్ క్రితంలో తనకు ఏదైనా పెద్ద అనారోగ్యం చుట్టుముడితే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు.
దీని వల్ల, ఇప్పటికే షెడ్యూల్ అయిన లాస్ వెగాస్ లో పలు ఎన్నికల మీటింగుల్లోఆయన పాల్గొనాల్సి ఉండగా తొలి సమావేశం సందర్భంగా ఆయన కోవిడ్ బారిన పడ్డారు.
కావున, ఆయన సమావేశాన్ని మధ్యలోనే ముగించుకుని సెల్ఫ్ ఐసోలేషన్ కోసం డెలావేర్‌లోని తన బీచ్ హౌస్‌కు వెళ్లారు.
అధ్యక్షుడు జలుబు, దగ్గు మరియు ఇతర సాధారణ రోగ లక్షణాలతో బాధపడుతున్నారని శ్వేత సౌధం (White House) ప్రకటనలో తెలిపింది.
అయితే, ఈ ప్రస్తుత పరిస్థుతుల్లో, ఇటీవలి హత్యాయత్నం నుంచి బయటపడ్డాక డొనాల్డ్ ట్రంప్ విజయావకాశాలు చాలా వరకు ఎక్కువయ్యాయని పలూ సర్వేలలో తెలుస్తోంది.