న్యూఢిల్లీ: కరోనా ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. పేద, ధనిక లేదు, పెద్దా, చిన్నా లేదు, అందరిని సమానంగా కాటేస్తొంది. నిన్న యూపీ విద్యాశాఖ మంత్రి కరోనాతో చనిపోయారు.
న్యూఢిల్లీ:
కేంద్ర హోంశాఖ మంత్రి,బీజేపీ పెద్ద అయిన అమిత్ షా కి కూడా కరోనా పాజిటివ్ తేలింది.
తమిళనాడు:
ఆ తరువాత తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ కి కూడా పాజిటివ్ తేలింది. దాంతో ఆయనను డాక్టర్స్ హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.
తాజాగా కాంగ్రెస్ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం కరోనా బారిన పడినట్లు సోమవారం తెలిపారు. ‘నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌కు సంబంధించిన సాధారణ లక్షణాలు ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారంతా వైద్యులు ఇచ్చే కరోనా సూచనలు పాటించాలని కోరుతున్నా’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
కర్నాటక:
కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కూడా నిన్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయం ఆయనే స్వయంగా తెలిపారు. టెస్టులో పాజిటివ్ వచ్చిందని, డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రి లో చేరుతున్నానని, తనను కలిసిన వారిని టెస్టు చేసుకోవలసినదిగా కోరారు.