న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 73,272 కొత్త కేసులు నమోదయ్యాక, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 69,79,424 కు చేరుకుంది. గత 24 గంటల్లో 926 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,07,416 కు చేరుకుందని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తన ప్రకటనలో తెలియ జేసింది.
అయితే శుభూ పరిణమం ఏంటంటే కేసుల నుంచి మొత్తం రికవరీల సంఖ్య 59,88,822కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,83,185 గా ఉంది. అంటే దేశం మొత్తం ఉన్న కేసుల్లో ఇప్పుడూ యాక్టివ్గా ఉన్న కేసులు కేవలం 12.65 శాతంగా ఉన్నాయి.
ఇటీవల వరకు 9 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉంటూ ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9లక్షల దిగువకు చేరాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 85.81 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.54 శాతానికి పడిపోయింది