అమరావతి: కరోనా రోజు రోజు కొత్త పుంతలు తొక్కుతోంది. అంతు చిక్కని లక్షణాలతో దాడి చేస్తోంది. వైరస్ విస్తరించే కొద్దీ రకరకాల లక్షణాలు బయటపడుతున్నాయి. ఇప్పటీ వరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్దారించిన లక్షణాలు కాకుండా ఇతర లక్షణాలను పాజిటివ్ గా పరిగనించాలో తెలియక వైద్యులు తర్జనభర్జన పడుతున్నారు.
లక్షణాలు ఉన్న వారికి పరీక్షలో నెగటివ్ రావడం, లక్షణాలు లేని వారికి పాజిటివ్ రావడం కలవరానికి గురి చేస్తోంది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులని అంచనా వేసి, వాటిని పరిష్కరించే పనిలో డబ్ల్యూహెఓ మరియు ఐసీఎంఆర్ నిమగ్నమయ్యాయి.
కరోనా లక్షణాలు (ఇప్పటివరకు ఉన్నవి):
-> దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోలేక పోవడం..
-> కళ్లలో తేడాలుండడం
-> శరీరం బలహీనంగా అనిపించడం, అలసట.. గొంతు తడారినట్టుగా ఉండి, విపరీతంగా
పొడిదగ్గు.. ఊపిరితిత్తుల వ్యవస్థను దెబ్బ తీయడం
-> శరీరానికి అవసరమైన ఆక్సిజన్ శాతాన్ని తగ్గిపోయేలా చేయడం
-> కొందరిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం
కరోనా లక్షణాలు (కొత్తగా బయటపడ్డవి):
-> రోజులో ఐదారుసార్లు పైనే వాంతులు, కడుపులో వికారంగా ఉండటం
-> కడుపు ఉబ్బరం
-> నీళ్ల విరేచనాలు
-> ఆహారం అరగకపోవడం
-> చర్మంపై దద్దుర్లు, ఇవి క్రమంగా తీవ్రమవుతూ అరికాళ్లలో తిమ్మిర్లు రావడం
-> మూర్ఛ, నత్తి
అరచేతిలు, అరికాళ్ళు తిమ్మిర్లుగా ఉండడం, ఫిట్స్ రావడం, నత్తిగా ఉండడం లాంటి లక్షణాలు కూడా తాజాగా లక్షణాలలో చేర్చారు. పాజిటివ్ పేషంట్లలో డయేరియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.