హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు కరోనా నంబర్స్ తక్కువగా, ఎక్కడో ఎవరికో వచ్చింది అని చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. కమ్యూనిటీ వ్యాప్తి మొదలైనప్పటి నుండి ఎవరికి ఉంది ఎవరికి లేదు అని తెలియని పరిస్థితి. మన చుట్టూ ఉండే వాళ్లలో ఎంత మందికి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎక్కువ నమోదు అయితున్న కేసులు కూడా వ్యాధి లక్షణాలు ఏమి లేకుండా ఉంటున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా కరోనా వల్ల చాలానే ప్రభావితం అయింది. వ్యాధి వ్యాప్తి ప్రబలుతోంది అనే ఉదేశ్యం తోనే సినిమా షూటింగ్లు నిలిపివేశారు. అయినా కూడా ఇండస్ట్రీ లో ఉన్న ఫేమస్ డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి కరోనా పాజిటివ్ అని తెలుస్తుంది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా వచ్చి కోలుకున్న విషయం తెలిసిందే. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి కుటుంబం కూడా ఈ మధ్యనే కరోనా పాజిటివ్ అని నిర్థారించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య కూడా కరోనా బారిన పడ్డాడు. ఇంకా ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కరోనా వచ్చి కోలుకున్నాడు. ఈ మధ్యనే ప్రముఖ గాయకుడూ యస్ పి బాల సుబ్రహ్మణ్యం కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. డైరెక్టర్ తేజ కి కూడా కరోనా అని ఒక టాక్ నడుస్తుంది. ఇంతే కాకుండా కొంతమంది బుల్లి తెర నటులకి కూడా కరోనా వ్యాపించింది. ఇవన్నీ బయటకి చెప్పుకున్న వాల్ల లిస్ట్, ఇంకా ముందు ముందు ఇండస్ట్రీ నుండి ఇంకా ఎంత మంది కరోనా బారిన పడతారో, షూటింగ్స్ మొదలు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది తెలియని పరిస్థితి.