స్టార్ హీరోలు లేని సినిమా బాక్సాఫీస్‌ను హ్యాండిల్ చేయలేదనేది ఓ భ్రమగా మిగిలిపోతోంది. నాని ప్రెజెంట్ చేసిన ‘కోర్ట్’ అనే చిన్న సినిమానే ఇప్పుడు ఆ భ్రమను ఛేదిస్తోంది. కోర్ట్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతి రోజూ గ్రోత్ చూపిస్తూ, ఎనిమిదవ రోజుకూ అదే రేంజ్ కొనసాగిస్తోంది.
ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మొదటి రోజే ₹8.10 కోట్ల గ్రాస్ వసూళ్లతో జోరుగా ఆరంభమైంది. మూడు రోజుల్లోనే ₹24.4 కోట్లు, ఐదో రోజుకు ₹33.55 కోట్లు, ఆరో రోజు ₹36.85 కోట్లు వసూలు చేసింది. వారం ముగిసే నాటికి ₹39.60 కోట్లు దాటేసిన ఈ సినిమా, తాజాగా ఎనిమిదవ రోజుకి వరల్డ్‌వైడ్ గ్రాస్ ₹42.30 కోట్ల మార్క్‌ను చేరింది.
సినిమాకు లభిస్తున్న బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్ల సంఖ్య పెరుగుతుండటం, పోటీ లేకపోవడం ఈ సినిమా రన్‌కు అదనపు బలంగా మారింది. యూఎస్ఏలో ఇప్పటికే $900K వసూళ్లు సాధించి, మిలియన్ క్లబ్ చేరే దిశగా సాగుతోంది.
ఈ వేగం అలాగే కొనసాగితే, లాంగ్ రన్‌లో ఈ సినిమా ₹60 కోట్లు వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంటెంట్‌ను ముద్దాడే ప్రేక్షకుల హృదయ స్పందన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోంది. నాని ప్రెజెంటేషన్‌తో పాటు దర్శకుడు రామ్ జగదీష్‌కు ఇది ఓ గుర్తుంచుకునే విజయంగా నిలుస్తోంది.