హైదరాబాద్ : భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనాకు సంబంధించిన కోవాక్సిన్‌ను మనుషులపై క్లీనికల్ ట్రయల్స్ చేయడానికి ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన సంగతి విదితమే. ఐసీఎంఆర్ కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 12 కేంద్రాలను ఎంపిక చేసింది.
అందులో హైదరాబాద్‌లోని ప్రముఖ నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) కూడా చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో నిమ్స్ అధికారులు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత జూలై 7 నుంచి ట్రయల్స్ ప్రారంభిస్ప్రంచాల్సినప్పటికి కటించినప్పటికీ కాస్త బ్రేక్ పడింది అది వాయిదా పడింది.
ఈ రోజు అనగా మంగళవారం నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. వైద్యులు వాలంటీర్ల బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి వాటిని సెంట్రల్ ల్యాబ్‌కు పంపించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మొత్తం 12 కేంద్రాల్లో 375 మందిపై మొదటి డోస్‌ను పరీక్షించనున్నారు.
కాగా హైదరాబాద్ లోని నిమ్స్‌లో దాదాపుగా 60 మందిపై క్లినికల్ ట్రయల్స్ జరిపే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో. వ్యాక్సిన్‌ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.
ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది.