న్యూఢిల్లీ: భారత స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరొక సారి ఎదురుదెబ్బ తగిలింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు పూర్తి స్థాయి లైసెన్స్ ను ఇవ్వడానికి డీసీజీఐ నిరాకరించింది. కొవాగ్జింపై ఇంకా క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలని భారత్ భారత్ బయోటెక్‌కు డీసీజీఐ చెప్పినట్లు సమాచారం.
అందుచేత వ్యాక్సిన్ కు ఫుల్‌లైసెన్స్ పర్మిషన్ ఇప్పుడే ఇచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపడుతోంది. అంతేకాక కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను గర్బిణీ స్త్రీలకు వాడొద్దని కూడా డీసీజీఐ తెలిపింది. కాగా దేశంలో ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద మాత్రమే కోవాగ్జిన్ వినియోగానికి అనుమతించారు.
కాగా ఇటీవలే ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ లో 77.8శాతం సమర్ధత ఉందంటూ డీసీజీఐకి కొవాగ్జిన్ డేటా సమర్పించింది. తమ మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్ బయోటెక్ సంస్థ తన డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపించింది. కాగా ఈ విషయంపై ఇప్పటి వరకు భారత్ బయోటెక్ స్పందించలేదు. ఇప్పటికే అమెరికాలో కోవాగ్జిన్ సరఫరాకు యూఎఫ్ఎఫ్‌డీఏ అంగీకరించలేదు.