fbpx
Thursday, September 19, 2024
HomeNationalకొవాగ్జిన్ ధర ఇంతకన్నా తగ్గించలేమన్న భారత్‌ బయోటెక్‌

కొవాగ్జిన్ ధర ఇంతకన్నా తగ్గించలేమన్న భారత్‌ బయోటెక్‌

COVAXIN-PRICE-REDUCTION-IMPOSSIBLE-SAYS-BHARAT-BIOTECH

న్యూఢిల్లీ: భారత దేశ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలపై సంస్థ ఉసూరు మనిపించింది. ప్రైవేట్ మార్కెట్ ‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలను ఇక ఇంతకంటే తగ్గించలేమని భారత్ బయోటెక్ ప్రకటించింది. దీనికి సంబంధించి సదరు సంస్థ మంగళవారం ఒక ప్రకటన విఢుదల చేసింది.

ఈ ప్రకటనలో తమకు నష్టాలొస్తున్నప్పటికీ, ఇప్పటికే చాలా తక్కువ ధరకే కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని తెలిపింది. కాగా తాము కేంద్రానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం రూ.150లకే అందిస్తున్నామని కోవాగ్జిన్‌ తయారీదారు భారత్‌ బయోటక్‌ తెలిపింది. చాలా రోజులు ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయలేమని తెలిపింది.

దీనితో పాటు తమ ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువ వ్యాక్సిన్ మాత్రమే ప్రైవేట్‌ ఆస్పత్రులకు, మిగిలిన వాటిని రాష్ట్రాలకు, కేంద్రానికి సరఫరా చేసినట్లు కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను ఖచ్చితంగా తగ్గించలేము అన్ని భారత్ బయోటెక్ తేల్చి చెప్పేసింది. నష్టాలను పూడ్చుకునేందుకే ప్రైవేటులో ఈ ధరలను అమలు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular