fbpx
Sunday, January 19, 2025
HomeTelanganaయూకే వైరస్ పై బాగా పనిచేస్తున్న కోవాక్సిన్!

యూకే వైరస్ పై బాగా పనిచేస్తున్న కోవాక్సిన్!

COVAXIN-WORKING-ON-UK-VIRUS-EFFECTIVELY-TWEETS-BHARAT-BIOTECH

న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా బ్రిటన్ లో కొత్తగా కనిపించి కలవరపెట్టిన కొత్త స్ట్రెయిన్ ఇంకా కలవర పెడుతోంది. కాగా కొత్త రకం కరోనా వైరస్‌ కేసులో భారత్‌లో పెరుగుతున్న నేపథ్యంలో కోవాక్సిన్ టీకా తయారీదారు అయిన భారత్‌ బయోటెక్‌ కీలక విషయాన్ని తెలిపింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ బ్రిటన్‌లో కలకలం రేపిన కొత్త ర‌కం ప్రాణాంతక క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్న‌ట్లు బుధవారం వెల్ల‌డించింది.

ఈ విషయాన్ని భార‌త్ బ‌యోటెక్ ఈ రోజు‌ తమ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. చైనాలో వూహాన్‌లో పుట్టిన కోవిడ్‌-19 కంటే 70 శాతం ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు భావిస్తున్న బ్రిటన్‌ కొత్త వేరియంట్‌ వైరస్‌ను తమ వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌‌ విజయవంతంగా నిలువరిస్తోందని వెల్లడించింది. దీనికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్‌ చేసింది.

ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతక వైర‌స్ వ‌ల్ల మ‌రణాల సంఖ్య కూడా చాలా వరకు పెరుగుతోందని ఇటీవల బ్రిటన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల అనేక దేశాలు విదేశీయాన ఆంక్షలను కూడా విధించాయి. అయితే ఇప్పటికే బ్రిటన్‌ నుంచి విమానాల ద్వారా ఇండియాకు చేరిన వారిలో 150 మంది కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్‌ బారిన పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular