అమరావతి: కరోనా చికిత్సలో ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ లోకి చేర్చిన ప్రభుత్వం, తాజాగా ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ చికిత్సకు అనుమతి ఇస్తూ అక్కడ వసూలు చేయవలసిన చికిత్స రుసుములను కూడా ఖరారు చేసింది.
ఇప్పటివరకు కరోనా చికిత్సను ప్రభుత్వం నిర్ణయించిన ఆస్పత్రుల్లో, అలాగే ప్రయివేటు వైద్య కళాశాలలోనే అందిస్తోంది. దేశం మొత్తం మీద కేసులు పెరుగుతున్న దృష్త్యా ఇప్పుడు చికిత్సను ప్రయివేటు ఆస్పత్రుల్లోను అందించాలని నిర్ణయించింది. వాటికి సంబంధించి మార్గదర్శకాలను, మరియు చికిత్స రుసుములను ప్రకటించింది.
వైద్య ఆరొగ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ డా.కె.యస్. జవహర్ రెడ్డి ఈ క్రింది విధంగా ఉత్తర్వులిచ్చారు:
-> ప్రభుత్వం నిర్దారించిన, అనుమతించిన ఆస్పత్రులో, ప్రయివేతు వైద్య కళాశాలలో అందరికీ చికిత్సను ఉచితంగానే అందిస్తుంది.
-> ప్రభుత్వ ఆస్పత్రులోనూ చికిత్సను ఉచితంగానే అందిస్తుంది.
-> ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో ఉన్న ఆస్పత్రులో బీపీఎల్, ఏపీల్ కుటుంబాలకు చికిత్స ఉచితంగానే అందిస్తుంది. వీరికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.
-> ఇక నెట్ వర్క్ లో లేని ఆస్పత్రుల్లో చికిత్సకు ప్రభుత్వం చెల్లించదు. ఇలాంటి ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ జాబితాలో చేరాలనుకుంటే, జిల్లా కలెక్టర్లు అదే రోజు అనుమతులు మంజూరు చేయవచ్చు. అయితే కోవిడ్ చికిత్స అందివ్వాలంటే70 పడకల గదులు అందుబాటులో ఉండాలి.
-> అత్యవసరమైన ప్రసవం, శస్త్రచికిత్స సమయంలో ఆర్టీపీసీఆర్ లేకుండానే చికిత్స అందించవచ్చు. అయితే తరువాత పాజిటివ్ వస్తే అధికారులకు తెలియజేయాలి.
-> చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందచేయాలి.
-> ప్రయివేతు ఆస్పత్రుల్ ప్ర్యవేక్షణ భాద్యత కలెక్టర్లదే.
ఈ ప్రక్రియ నిర్వహణకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో వెబ్‌పోర్టల్ పనిచేస్తుంది.
కోవిడ్ చికిత్సకు ప్రయివేటు ఆస్పత్రుల్లో వసూలు చేయవలసిన రుసుముల పరిమితులు:
-> అత్యవసర పరిస్థితి లేని రోగులకు వైద్యానికి రోజుకు రూ. 3,250
-> ఎన్ఐవీతో ఐసీయూ చికిత్స అందిస్తే రోజుకు రూ. 5,980
-> అత్యవసర రోగులకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే రోజుకు రూ. 5,480
-> వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తే రూ. 9,580
-> ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు వెంటిలేటర్ రహిత చికిత్స అందిస్తే రూ. 6,280
-> ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి చికిత్స అందిస్తే రోజుకు రూ. 10,380
పై రుసుములను మించి వసూలు చేస్తే ఖఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.