హైదరాబాద్ : రేపటి నుండి తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతిన్ ఇచ్చింది. ప్రస్తుతానికి కేవలం 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందివ్వాలని ఆదేశించింది. పైగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకా వేయాలని తెలిపింది.
ఆసుపత్రులు నేరుగా వ్యాక్సిన్‌లను కంపెనీల నుంచి సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలంగాణ హెల్త్ డైరక్టర్ జీ. శ్రీనివాసరావు ఆసుపత్రి వర్గాలను కోరాయి.
అలాగే కరోనా సోకిన రోగులకు చికిత్స విషయంలో కూడా ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హెల్త్ డైరక్టర్ పలు సూచనలు జారీ చేశారు. కోవిడ్ పేషంట్లకు ఆక్సిజన్ రేటు 94 శాతం కంటే ఎక్కువగా ఉన్న వారిని హోం ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్లకు సిఫారసు చేయాలని తెలిపారు.
కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని రిపోర్టులతో సంబంధం లేకుండా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలన్నారు. అంతేకాకుండా ఆస్పత్రుల ఎంట్రెన్స్ వద్ద బెడ్ల వివరాల పట్టికను ఉంచాలని ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సూచించారు.