న్యూఢిల్లీ: దేశంలో ఇంకా కోవిద్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు దేశంలో వ్యాక్సినేషన్ ఒక నిరంతర ప్రక్రియ అయింది. కాగా వ్యాక్సినేషన్ వేయడంలో ఒకో రాష్ట్రం ఒకో విధంగా ముందుకు వెళ్తోంది. కాగా దేశంలో ఇప్పటివరకు దాదాపు 20.3 శాతం మందికి మొదటి మరియు రెండవ డోసుల వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ప్రభుత్వం యొక్క తాజా గణాంకాలు వెల్లడించాయి.
కాగా దేశంలో వ్యాక్సినేషన్ లో టాప్ 5 రాష్ట్రాల వివరాలు ఇలా ఉన్నాయి. వ్యాక్సినేషన్ లో కేరళ 36% తో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి గుజరాత్ 35.3% తో రెండవ స్థానంలో ఉండగా, దేశ రాజధాని ఢిల్లీ 34% తో మూడవ స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 33.3% తో నాలుగవ స్థానంలో ఉంది. ఇక 5వ స్థానంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ 30.5% తో నిలిచింది.
ఏపీ విషయానికొస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో 18–44 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులు 3.47 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా తొలి డోసు, 1.66 కోట్ల మందికి పైగా రెండు డోసులు వేశారు. అంతకుముందే హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు నిండిన వారు, ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు కూడా ఇప్పటికే టీకా వేశారు.
టాప్ 5 రాష్ట్రాల వివరాలు:
కేరళ 36%
గుజరాత్ 35.3%
న్యూఢిల్లీ 34%
జమ్మూ కాశ్మీర్ 33.3%
ఆంధ్రప్రదేశ్ 30.5%