మూవీడెస్క్: ఎన్టీఆర్ ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం దేవర సినిమా పూర్తిచేయడం కోసం కష్టపడుతున్నారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం విడుదలైన తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించనున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే వార్ 2 సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని సమాచారం.
అలాగే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాని కూడా ప్రారంభించబోతున్నారంట. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నిర్మించబడుతోంది.
NTR31 పేరుతో ప్రకటించిన ఈ సినిమాకు “డ్రాగన్” టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ గత ఏడాది సలార్ సినిమాతో భారీ హిట్ సాధించారు.
సలార్ పార్ట్ 2ను త్వరలో పూర్తి చేసి 2025లో విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ముందుగా ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమాని మొదలుపెట్టనున్నారు.
డ్రాగన్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తై, ప్రీప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమా మరికొన్ని వారాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సినిమా కాస్టింగ్ కూడా పూర్తయిందని సమాచారం.
ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2ను సెట్స్ పైకి తీసుకొస్తారని భావిస్తున్నారు. ఇక, ఎన్టీఆర్ సెప్టెంబర్ 27న దేవర చిత్రం విడుదల చేసిన తర్వాత, వార్ 2, డ్రాగన్ చిత్రాలు పూర్తి చేసి, దేవర పార్ట్ 2ను ప్రారంభించే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.