గుజరాత్: టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు భారీ కుంభకోణంలో ఇరుక్కున్నట్టు గుజరాత్ సీఐడీ నిర్ధారించింది.
రూ. 450 కోట్ల పోంజీ స్కామ్‌లో వీరు పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు ప్రజల మధ్య సంచలనం రేపుతున్నాయి. బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనే సంస్థ ప్రజలను అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేసినట్టు సీఐడీ వెల్లడించింది.
బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝులాను సీఐడీ అరెస్ట్ చేయగా, క్రికెటర్ల పాత్రపై విచారణ చేపట్టింది.
గిల్ ఈ సంస్థలో రూ. 1.95 కోట్లు, సుదర్శన్, తెవాటియా, మోహిత్‌లు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు పెట్టుబడి పెట్టారని సమాచారం. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లపై ఈ ఆరోపణలు రావడం అభిమానులకు షాక్‌గా మారింది.
గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో ఉండగా, అతడితో పాటు ఇతర క్రికెటర్లను సీఐడీ విచారణకు పిలవనుంది. ఈ స్కామ్ సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా, క్రికెట్ అభిమానులకు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.