మూవీడెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్ ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఖైదీ నంబర్ 150లో తన కల నెరవేర్చుకున్న శేఖర్, తన స్టైల్‌తో డ్యాన్స్ ప్రియులను మెప్పించాడు.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నంబర్ వన్ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ పేరు వినిపిస్తోంది.
అయితే, గత కొంతకాలంగా శేఖర్ డాన్స్ మూవ్స్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి.
ప్రత్యేకంగా మాస్ స్టెప్స్ పేరుతో రొమాంటిక్ మూమెంట్స్‌ను వల్గారిటీగా మలుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
మిస్టర్ బచ్చన్లోని సితార్ పాటలో ఆయన డిజైన్ చేసిన స్టెప్స్ తీవ్ర చర్చకు దారితీశాయి.
బొడ్డు కింద చేయి పెట్టడం, బ్యాక్‌పై తబలా మాదిరి స్టెప్స్‌పై ఫ్యామిలీ ఆడియన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇటీవల విడుదలైన పుష్ప-2లో పీలింగ్స్ పాట కూడా విమర్శలపాలు అయింది.
రొమాంటిక్ మూమెంట్స్ పేరుతో శ్రుతి మించుతాడని, కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు అసౌకర్యంగా అనిపిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు డాకు మహారాజ్లోని దబిడి దిబిడి పాటలోనూ అదే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తన ప్రత్యేకతను కొనసాగించాలంటే శేఖర్ మాస్టర్ మూస బయటికి రావాల్సి ఉందని, మరింత శ్రద్ధ తీసుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.