దుబాయ్: సిద్దార్థ్ కౌల్ వేసిన చివరి ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్స్ కొట్టి, తన జట్టును ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 ప్లే ఆఫ్‌లోకి పంపించాడు. విజయం కోసం 135 పరుగులను ఛేజింగ్ లో, సీఎస్కే కి చివరి ఓవర్‌లో మూడు పరుగులు అవసరం మరియు అంబటి రాయుడు తన కెప్టెన్‌కు స్ట్రైక్ ఇచ్చారు.
కౌల్ వేసిన నాలుగో బంతికి సిక్స్‌తో, ధోని చెన్నై కి విజయాన్ని అందించడమే కాకుండా, చెన్నైని ప్లే ఆఫ్‌లో స్థానం ఖరారు చేసుకున్నాడు. అంతకుముందు, షార్జా క్రికెట్ గ్రౌండ్‌లో టాస్ గెలిచిన ధోనీ సన్ రైజర్స్ హైదరాబాద్ ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు ఎంఎస్ ధొనీ.
మునుపటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన జాసన్ రాయ్‌ను కేవలం రెండు పరుగులకే కోల్పోయినందున ఎసార్హెచ్ పేలవమైన ఆరంభాన్ని పొందింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా డ్వేన్ బ్రావో బౌలింగ్లో అవుట్ అయ్యి బ్యాటింగ్ లో విఫలమయ్యాడు.
వృద్ధిమాన్ సాహా (44) మరియు అభిషేక్ శర్మ మరియు అబ్దుల్ సమద్ ల నుండి వచ్చిన మద్దతుతో హైదరాబాద్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 134/7 స్కోరు చేయడంలో సహాయపడ్డాయి. చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి సీఎస్కే కోసం ఫాఫ్ డు ప్లెసిస్ మరియు రుతురాజ్ గైక్వాడ్ సరైన ఆరంభాన్ని అందించారు.
వీరిద్దరూ తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించారు. గైక్వాడ్ 45 పరుగుల వద్ద అవుటవ్వగా, డు ప్లెసిస్ (41) కూడా అర్ధ సెంచరీని కోల్పోయాడు. చివరికి, సీఎస్కే రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుని ప్లే-ఆఫ్స్ కి చేరిన తొలి జట్టు అయింది.