
స్పోర్ట్స్ డెస్క్: CSK vs KKR: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ చిత్తు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌గా మళ్లీ మైదానంలోకి వచ్చిన మహీ, జట్టును నిలబెట్టలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో కేవలం 103 పరుగులకే పరిమితమైంది.
సీఎస్కే బ్యాటింగ్‌లో శివం దూబే(31 నాటౌట్) తప్ప ఇంకెవ్వరూ మెరుగైన స్కోరు చేయలేకపోయారు. విజయ్ శంకర్ 29, త్రిపాఠి 16 పరుగులు చేశారు. ధోనితో సహా పలువురు బ్యాటర్లు డబుల్ డిజిట్ కూడా అందుకోలేకపోయారు. కేకేఆర్ బౌలింగ్‌లో నరైన్ మూడు వికెట్లను తీశాడు, వరుణ్, హర్షిత్ చెరో రెండు వికెట్లు తీశారు.
104 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. నరైన్(44), డికాక్(23) వేగంగా ఆడగా, చివర్లో రహానే(20), రింకూ(15) విజయాన్ని ఖాయం చేశారు. 10.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించారు.
ఈ విజయంలో కేకేఆర్ బౌలింగ్, టాప్ ఆర్డర్ దూకుడే కీలకంగా నిలిచాయి. సొంతగడ్డపై చెన్నై ఘోరంగా ఓడడంపై అభిమానుల్లో నిరాశ నెలకొంది. ధోని కెప్టెన్సీ కమ్‌బ్యాక్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. చెన్నై మాత్రం కిందకి జారిపోయింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే వెంటనే గేమ్ మోడ్ మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది.