ఐపీఎల్ 2025 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్‌కు అదే పాత కథ మళ్లీ రిపీట్ అయింది. గత 13 సీజన్ల నుంచి తొలి మ్యాచ్‌లో ఓడిపోతున్న ఆ జట్టు ఈసారి కూడా అదే దిశగా సాగింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ మరోసారి విఫలమవగా, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 29, తిలక్ వర్మ 25 బంతుల్లో 31 పరుగులతో కొంత ఆదుకున్నారు. చివర్లో దీపక్ చాహర్ 15 బంతుల్లో 28 పరుగులు చేసి స్కోర్‌ను కాస్త మెరుగుపరిచాడు.
సీఎస్‌కే బౌలింగ్‌లో నూర్ అహ్మద్ ధాటిగా రాణించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు (4 ఓవర్లలో 29), నాథన్ ఎల్లిస్, అశ్విన్ తలో వికెట్ తీశారు. దీంతో ముంబై పెద్ద స్కోర్ పెట్టలేక నిరాశలో మిగిలింది.
లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే డొమినేట్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 53 పరుగులతో అద్భుతంగా ఆడాడు. రచిన్ రవీంద్ర 44 బంతుల్లో 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ జోడీ కీలక భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ఛేదించేందుకు బలమైన పునాది వేసింది.
ముంబై బౌలింగ్‌లో విజ్ఞేష్ పుతుర్ 3/32తో మెరుగ్గా రాణించగా, దీపక్ చాహర్, విల్ జాక్స్ చెరో వికెట్ తీసారు. అయినప్పటికీ, చెన్నై జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ విజయంతో సీఎస్‌కే సీజన్‌కు శుభారంభం చేసింది. ముంబైకి తొలి మ్యాచ్‌లను గెలవడం ఇంకా సాధ్యపడకపోవడం సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్‌కు దారితీస్తోంది. ఇక చెన్నై, నూతన కెప్టెన్ రుతురాజ్ నేతృత్వంలో మంచి కాన్ఫిడెన్స్‌తో ముందుకు సాగుతోంది.