తెలుగు రాష్ట్రాలు: తెలుగు రాష్ట్రాలలో విద్యుత్ వినియోగదారులకు కీలకమైన సమాచారం అందింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) మరియు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) తమ వినియోగదారుల కోసం పాత విధానాన్ని పునరుద్ధరించాయి.
ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ చెల్లింపుల యాప్‌లు మళ్లీ అందుబాటులోకి తెచ్చి, వినియోగదారులకు ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపు సులభతరం చేశారు.
కొద్ది నెలల క్రితం, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం డిస్కమ్‌లు యూపీఐ చెల్లింపులను నిలిపివేయడం వల్ల వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చెల్లింపులు నిలిపివేయడంతో పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించేందుకు, పునరుద్ధరించిన ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లింపులను మళ్లీ ప్రారంభించారు.
తాజాగా తీసుకొచ్చిన ఈ మార్పుతో, వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్ మరియు ఏపీసీపీడీసీఎల్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఉపయోగించడంతో పాటు, ఫోన్‌పే, గూగుల్‌పే లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా కూడా చెల్లింపులు చేయగలుగుతారు.
ఈ సదుపాయం కేవలం నాలుగు లేదా ఐదు రోజుల్లోనే అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.