టాలీవుడ్: టాలీవుడ్ హంక్ హీరో రానా దగ్గుబాటి. రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్ ల వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ లీడర్ సినిమా ద్వారా 2010 లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు ఈ హీరో. కేవలం హీరో పాత్రలు అనే కాకుండా తన దగ్గరికి వచ్చిన యాక్టింగ్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాలతో మంచి పేరే సంపాదించాడు. ఇంతటి పేరున్న హీరో బాహుబలి సినిమాలో విలన్ గా నటించడానికి కూడా వెనుకాడలేదు. ఈ మధ్య కేరాఫ్ కంచరపాలెం, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి సినిమాలని కొని తన బానర్ ద్వారా విడుదల చేసి తన టేస్ట్ అఫ్ సినిమా ఎలా ఉంటుందో కూడా తెలియ చేసాడు. ప్రస్తుతం రానా నటిస్తున్న ‘అరణ్య’, ‘విరాట పర్వం’ షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.
ఈ హీరో ఇవ్వాలనే పెళ్లి పీటలెక్కాడు. తాను ప్రేమించిన అమ్మాయితోనే ఈ రోజు హైదరాబాద్ లో పెళ్లి చేసుకుంటున్నాడు. గత మూడు రోజులుగా వరుస ఈవెంట్ లతో, ఫోటో లతో సోషల్ మీడియాలో రానా పెళ్లి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. కానీ రానా ఇవాళ చేసిన ఒక పోస్ట్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. వారి పెళ్లి సందడి మొత్తం ఆ పిక్ లో కనపడుతుంది. తన తండ్రి బాబాయ్ లతో కలిసి ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్నాడు రానా. దగ్గుబాటి వెడ్డింగులో వెరీ స్పెషల్ ఫోటో ఇది.
అలాగే రానా కి సోషల్ మీడియా లో చాలానే కామెంట్స్ వచ్చాయి. ‘ఈ లాక్ డౌన్ లో పెర్మనెంట్ గా లాక్ డౌన్ ఐతున్నావు’ అని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విషెస్ తెలిపారు. ‘కని విని ఎరుగని లాస్ట్ జాలీడే ఇది నీకు’ అని నవదీప్, ‘ఐకానిక్ బాచిలర్ ఎండ్ చూస్తున్నా’ అని నాని పోస్ట్ పెట్టి వర్చ్యువల్ రియాలిటీ లో రానా పెళ్లి చూస్తున్నట్టు ఫోటో షేర్ చేసాడు. ఇలా చాలా మంది సెలబ్రిటీస్ చమత్కారంగా రానా కి పెళ్లి విషెస్ చెప్పారు.