టాలీవుడ్: టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘అరణ్య’. ఈ సినిమాని సౌత్ ఇండియా భాషల్లో మాత్రమే కాకుండా హిందీ లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అడవిని కాపాడే ఒక వ్యక్తి పాత్రలో రానా నటిస్తున్నాడు. తమిళ్ లో కుంకీ(తెలుగు లో గజరాజు) సినిమాని రూపొందించిన దర్శకుడు ‘ప్రభు సాల్మన్‘ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రానా తో పాటు తెలుగు మరియు తమిళ్ లో రాచసన్ ఫేమ్ విష్ణు విశాల్ నటిస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత రానా ఒక పెద్దసినిమాతో రావడం ఇదే మొదటి సారి. ఎపుడో ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయింది.
రానా కి బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమాకి హిందీమార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని కూడా రూపొందించారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు కానీ సంక్రాతి కి చాలా సినిమాలు కర్చీఫ్ వేయడం తో ఈ సినిమాకి వేరే విడుదల తేదీ ని ఖరారు చేసారు. ఈ సినిమాని మార్చ్ 26 న విడుదల చేయనున్నట్టు ఈరోజు ప్రకటించారు. మార్చ్ 26 న 5 భాషల్లో ఈ సినిమాని ఒకేసారి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాతో పాటు రానా ప్రస్తుతం సాయి పల్లవి తో కలిసి ‘విరాట పర్వం’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఈ సంవత్సరంలో విడుదల చేసే ఉదేశ్యం లో ఉన్నాడు.