మూవీడెస్క్: దగ్గుబాటి రానా! నేటి రోజుల్లో ఏ సినిమా విడుదలైనా బాక్సాఫీస్ కలెక్షన్ల హడావుడి తప్పదు. వందల కోట్ల గ్రాస్ అంటూ భారీ పోస్టర్లు, ప్రమోషన్లు చేయడం సాధారణమైపోయింది.
అయితే ఈ లెక్కలపై తరచూ ప్రశ్నలు రేగుతూనే ఉంటాయి. తాజాగా రానా దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.
OTT అమెజాన్ ప్రైమ్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న తన షో ప్రమోషన్‌లో భాగంగా రానా మాట్లాడుతూ, ‘‘బాక్సాఫీస్ కలెక్షన్ల పోస్టర్లలో చూపించే నంబర్లు వాస్తవాలు కావు.
అవి కేవలం ప్రమోషనల్ స్టంట్ల కోసం మాత్రమే చూపిస్తారు’’ అని పేర్కొన్నారు.
ఇలాంటి గ్రాస్ నంబర్లు అసలు ఫైనల్ లెక్కలకు సంబంధం లేకుండా ఉంటాయని, ప్రేక్షకులు వాటిని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని రానా అభిప్రాయపడ్డారు.
ఈ కామెంట్స్‌తో రానా మరోసారి తన బోల్డ్ స్వభావాన్ని చూపించాడు. రానా వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వివిధ రకాల రియాక్షన్స్ వస్తున్నాయి.
కొందరు రానా మాటలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇది ఇన్నేళ్లుగా ఉన్న సాంప్రదాయమని వ్యతిరేకిస్తున్నారు.
ఇక రానా త్వరలో ‘‘ది రానా దగ్గుబాటి షో’’ ద్వారా డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో మరో అడుగు వేస్తున్నాడు.
నవంబర్ 23న ప్రారంభమయ్యే ఈ షోలో రాజమౌళి, శ్రీలీల, రామ్ గోపాల్ వర్మ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ షో ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.