టాలీవుడ్: దగ్గుబాటి రానా హీరో గా , తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన అరణ్య సినిమా ఈరోజే విడులైంది. బహుభాషా సినిమా గా రూపొందిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో చూద్దాం.
నరేంద్ర భూపతి (రానా) కి చిన్నప్పటి నుండే తన తాతల దగ్గరి నుండి అడవితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. అది అలాగే కొనసాగించడానికి , ఏనుగుల వల్ల పర్యావరణానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, మానవ మనుగడకి అవి ఏం ఏం చేస్తాయో అని బలం గా నమ్మి ఆ అడవిని కాపాడే పనిలో ఉంటాడు రానా. దాదాపు 40 సంవత్సరాలుగా కొన్ని లక్షల మొక్కలు నాటి అడవులని కాపాడుతూ రాష్రపతి చేత అవార్డు పొంది ప్రజలందరి చేత ‘అరణ్య’ అని పిలుపుని కూడా పొందుతాడు. కానీ ఫారెస్ట్ మినిస్టర్ అడవిలో ఒక టౌన్ షిప్ ఏర్పాటు మొదలు పెడతాడు. దాని వలన అడవిలో చెట్లని నరికివేయడం , ఏనుగులు స్వేచ్ఛగా తిరగలేకపోవడం తో అరణ్య ఆ ప్రాజెక్ట్ పై తిరగబడతాడు. చివరికి తన అడవిని ఎలా మళ్ళీ సంరక్షించాడు అనేది మిగతా కథ.
కథ విషయం లో ఇది చిన్నప్పటి నుండి చూస్తున్న కథే. కానీ డైరెక్టర్ ప్రభు సాల్మన్ చెప్పాలనుకున్న విషయం మాత్రం గొప్పది. ఏనుగుల మనుగడ మనుషులని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని చెప్పడానికి ఇంకా బలమైన కథ కథనాల్ని వాడుంటే బాగుండు అనిపిస్తుంది. ఏనుగులు తిరిగే దట్టమైన అడవిలో టౌన్షిప్ అంటేనే రియాలిటీ కి దూరంగా ఉంది. దానితో పాటు మధ్యలో తీరు తెన్నూ లేని నక్సలైట్ ఎపిసోడ్, విష్ణు విశాల్ పాత్రలు ప్రేక్షకుడిని అసహనానికి గురి చేస్తాయి. సినిమా ఆరంభం ఒక క్లాసిక్ లా ప్రారంభం అయినా సినిమా మధ్యలో ఎటు వెళ్తుందో ఏమో అర్ధం కాదు. చివరకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చినా కూడా ప్రేక్షకుడిని అంతగా సంతృప్తి పరచాడు.
అరణ్య పాత్రని మొదటి అరగంట రాసుకున్న విధానం తర్వాత కూడా కొనసాగించుంటే బాగుండేది. అడవిలో ఉన్నా కూడా మంచి ఎడ్యుకేటెడ్ అన్నట్టుగా చూపించి మధ్యలో వచ్చే సన్నివేశాల్లో ఆలోచన లేకుండా మొరటుగా బిహేవ్ చేసే వ్యక్తి లాగా చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నీ వేషాలు ప్రేక్షకుడిని ఏం జరుగుతుందో ఏమో అనే అర్ధం కాని స్థితిలో పడేస్తాయి.
నటీ నటుల విషయానికి వస్తే ఒక్క రానా తప్పితే మిగతా ఎవరు స్క్రీన్ పైన అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. సినిమా కథ , కథనాలు ఎలా ఉన్నా రానా తన కెరీర్ లో ఇలాంటి పాత్ర ఇంత గొప్పగా చేశాను అని చెప్పుకునే పాత్ర ఇది అవుతుంది. తన హావ భావాలు, బాడీ లాంగ్వేజ్, ఏనుగులతో ముడిపడిన సన్నివేశాల్లో రానా నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ లో ఏనుగులకు నీళ్లకోసం పరితపించే ప్రయత్నంలో , ఏనుగులు రానా ని దూరం పెట్టే సమయంలో రానా నటన మరో స్థాయిలో ఉంటుంది. విష్ణు విశాల్, జోయా హుస్సేన్ పాత్రలు తేలిపోయాయి. కొంతవరకు రఘు బాబు తన పాత్ర ద్వారా ఆకట్టుకున్నాడు. జర్నలిస్ట్ పాత్ర చేసిన శ్రియ పిల్గోంకర్, మినిస్టర్ పాత్ర చేసిన అనంత్ మహదేవన్ తమ పరిధి మేరకి మెప్పించారు.
టెక్నిషియన్స్ లో ప్రభు సాల్మన్ నేచర్ లవర్ గా మంచి ప్రయత్నం చేసాడు కానీ బలమైన కథ, మరియు సన్నివేశాలు ఉంటే ఇంకా బాగుండేది. నేచర్ కి సంబందించిన సినిమా కాబట్టి ప్రకృతి ని ఎక్కువగా చూపించే సీన్స్ ఉంటాయి, ఈ సినిమాకి ఛాయా గ్రహణం చేసిన అశోక్ కుమార్ పరవాలేదనిపించాడు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఛాయా గ్రాహకుడు తన కెమెరా మాయాజాలంతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లవచ్చు. కానీ అలంటి ప్రయత్నం ఏమి ఇక్కడ జరగలేదనిపిస్తుంది. సంగీత దర్శకుడు శాంతను మొయిత్రా పాటలు అంతగా రిజిస్టర్ అవ్వవు కానీ బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా ఉంటుంది. ఈ సినిమాలో సౌండ్ డిజైన్ చేసిన ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి తన ప్రత్యేకత ఏంటి అనేది సినిమా మొదలైన 30 నిమిషాలు చూపిస్తాడు. టైటిల్స్ మొదలైనప్పటి నుండి తన సౌండ్ డిజైన్ ఆకట్టుకుంది. ఆ తర్వాత తనకి పని తనం చూపించుకునే అవకాశం కూడా పెద్దగా లేకపోయింది.
ఓవరాల్ గా చెప్పాలంటే aRANyA ఇది రానా వన్ మాన్ షో