టాలీవుడ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’ సినిమాని రీ-మేక్ చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో నటుడు నటించనున్నాడు, ఆ నటుడి పాత్ర ఎవరు పోషిస్తారు అని ఇప్పటికి చాలా మంది పేర్లు వినిపించాయి చివరకి ఈరోజుతో ఆ నటుడు ఎవరు అని తేలిపోయింది. ఈ సినిమాలో పవన్ తో ‘దగ్గుబాటి రానా’ నటించనున్నాడు. ఇప్పటికే కెరీర్ లో రకరకాల పాత్రలు పోషించిన రానా కి ఈ పాత్ర తన కెరీర్ లో మరొక మైలు రాయిగా నిలవనుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ సినిమాలో బిజూ మీనన్ నటించిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. బిజూ కి ధీటుగా పొగరున్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషించిన పృథ్విరాజ్ పాత్రలో రానా నటించనున్నాడు. అంతే కాకుండా రానా తండ్రి పాత్రలో ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని నటించనున్నాడు. ఇద్దరు సంబంధం లేని వ్యక్తుల మధ్య అనుకోకుండా వచ్చిన ఒక ఘర్షణ వల్ల వాల్ల మధ్య ఈగోలు పెరిగి ఒకరి పైన ఒకరు ఫైట్ చేసుకుంటూ ఎక్కడి వరకు తీసుకెళ్లారనేది ఈ సినిమా కథ. కథ సింపుల్ అయినా కూడా కథనం , భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు‘ లాంటి అద్భుతమైన సినిమాని దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈరోజే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకుని ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది