హైదరాబాద్: దగ్గుబాటి వారసుడిగా వచ్చిన రానా కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వచ్చాడు. లీడర్ లాంటి ఒక ప్రయోగవంతమైన సినిమా తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వెనక్కి తిరగకుండా తనకి పాత్ర నచ్చితే చేసుకుంటూ పోయి బాహుబలి లో భల్లాలదేవ పాత్రతో చాల ఎత్తుకు ఎదిగాడు. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ప్రొడక్షన్ హౌస్ ద్వారా కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాలని విడుదల చేసి తన టేస్ట్ ఏంటి అనేది కూడా నిరూపించుకున్నాడు. హీరో గా కెరీర్ ప్రారంభించకముందు రానా కి ఫిలిం స్టూడియో, ఫిలిం క్రాఫ్ట్స్ అలాగే యానిమేషన్, ఫిలిం మేకింగ్ పై దాదాపు అన్ని క్రాఫ్ట్స్ లో అవగాహన ఉంది.
ప్రస్తుతం రానా యానిమేషన్ సిరీస్ తో రాబోతున్నాడు. ఇందులో రియల్ పర్సన్స్ ని రానా ఇంటర్వ్యూ చేసి దాన్ని యానిమేషన్ రూపం లో కొత్తగా ప్రెసెంట్ చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా విడుదల చేసాడు రానా. ఇప్పటివరకు మనం డైరెక్ట్ ఇంటర్వూస్ చూసాం కానీ ఇలా ఒక డైరెక్ట్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేసి దాన్ని యానిమేషన్ రూపం లో విడుదల చేయడం కొత్తగా అనిపిస్తుంది. ఈ షో పేరు ‘వై ఆర్ యు’ అని రానా ప్రకటించారు. రానా ప్రస్తుతం ‘అరణ్య’, ‘విరాట పర్వం’ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. అవి దాదాపు షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి. కరోనా పరిస్థితులు మెరుగుపడ్డాక ఇవి రెండు ఇమ్మీడియేట్ గా విడుదలకి సిద్ధం అవుతాయి.