మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. జనవరి 4న ట్రైలర్ విడుదల చేయనున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన బాలయ్య, ఊర్వశీ రౌతేలా పాటకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సాంగ్‌లో బాలయ్య ఎనర్జీతో స్టెప్పులు వేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
సినిమా థియేటర్లలో సంచలన విజయం సాధించడానికి మేకర్స్ ఆశావాహంగా ఉన్నారు.
బాలయ్య గెటప్, పోరాట సన్నివేశాలు ఇప్పటికే ఆసక్తిని పెంచాయి.
సంక్రాంతి పోటీలో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నప్పటికీ, డాకు మహారాజ్పై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి.
తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో బాలయ్య కత్తి పట్టుకుని డాకూతో ఊచకోత కోస్తున్న ఫస్ట్‌లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అభిమానులు ఈ సినిమా బాలయ్య హ్యాట్రిక్ విజయాల జాబితాలో చేరుతుందని భావిస్తున్నారు.
నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు.
డాకు మహారాజ్ పెద్ద విజయం సాధిస్తే, బాలయ్య మార్కెట్ మరింత విస్తరించడం ఖాయం.
ఇక ఆ తర్వాత అఖండ 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.
ఈ సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో బాలయ్య ఎలా అదరగొడతారో చూడాలి!