
హైదరాబాద్: తెలంగాణలోని స్కూళ్ళకు ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ నుండి 14వ తేదీ వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెసింది.
ఈ సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
ఈ సారి దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. సెలవుల తరువాత పాఠశాలలు 15వ తేదీ నుంచి యథావిధిగా పనిచేస్తాయని ఉత్తర్వుల్లో తెలిపింది.
తెలంగాణలో ప్రతి దసరా పండుగ రోజు కు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.
అలాగే, అక్టోబర్ 2వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో మొదలై, దుర్గాష్టమి రోజున జరిగే సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి.
కాగా, దసరా పండుగకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.