ఆస్ట్రేలియా: స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమాలో అతను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. నాలుగు రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న వార్నర్‌కు భారీ పారితోషికం అందిందని టాక్.
సినిమాలో నటించినందుకు ఆయనకు రూ.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతేకాకుండా, ప్రమోషన్లలో పాల్గొనడానికి అదనంగా రూ.1 కోటి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్నర్ అభిమానులు “డేవిడ్ భాయ్ చాలా కాస్ట్లీ!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన వార్నర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఆల్రెడీ పుష్ప మూవీలో అల్లు అర్జున్ స్టైల్‌ను రీక్రియేట్ చేస్తూ వీడియోలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న రాబిన్ హుడ్ టీం, వార్నర్‌ను సినిమాకు తీసుకుని అంచనాలు పెంచింది. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. టాలీవుడ్‌లో వార్నర్ ఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.